శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 16 జులై 2014 (19:14 IST)

గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు.. ప్లస్ బ్యూటీ బెనిఫిట్స్!

ఉరుకులు, పరుగుల జీవితంలో అధికబరువుతో అనారోగాల పాలవుతున్న వారికి గ్రీన్‌‘టీ' దివ్యౌషదం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఉదరంలో ఉన్న శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి.  కాలరీలను తగ్గించి.. బరువును తగ్గిస్తాయి. 
 
అధిక బరువుతో బాధ పడేవారికి గ్రీన్‌‘టీ' ఓ చక్కని పరిష్కారం. కొవ్వును తగ్గించడంలో గ్రీన్‌‘టీ' చాలా ఉపయోగపడుతుంది. డయాబెటిస్‌ను దూరంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. దంత సమస్యలను నివారిస్తుంది. వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది. కీళ్ళనొప్పులను మాయం చేస్తుంది. 
 
బ్యూటీ బెనిఫిట్స్: గ్రీన్‌టీ తీసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మం కూడా మీ సొంతం అవుతుంది. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధమైనది కావడంతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతిరోజు 2 నుంచి 5 కప్పుల గ్రీన్‌‘టీ' తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. గ్రీన్‌టీలో ఉండే బలమైన యాంటి ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని కొంతమేరకు నిరోధిస్తాయి. చర్మం ముడుతలు పడటం తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.