మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (15:58 IST)

మంచి నిద్ర ప్లస్ బ్యూటీ కోసం.. పాలు తేనె కాంబినేషన్!

తేనె, పాల కాంబినేషన్ అటు ఆరోగ్యానికి.. ఇటు సౌందర్యానికి పనిచేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కాంతివంతమైన చర్మం, ప్రకాశవంతమైన క్లియర్ స్కిన్ చేకూరుతుంది. 
 
గోరువెచ్చని పాలు, తేనె మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరుగుతుంది. 
 
శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. రోజంతా ఎక్కువ శ్రమతో కూడిన పనిలో ఉన్నప్పుడు, ఈ రెండింటి మిశ్రమంతో నేచురల్ మిక్సర్‌ను త్రాగండి. 
 
ఇది చర్మానికి ప్రయోజనాలను అందివ్వడం మాత్రమే కాదు, రాత్రుల్లో మంచి నిద్రను పొందుతారు. అంటే కళ్ళ క్రింది నల్లటి వలయాలుండవు. మరుసటి రోజు ప్రకాశవంతమైన చర్మం సొంతం అవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.