బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2014 (18:14 IST)

యాంటీ ఏజింగ్‌గా పనిచేసే పంచదార‌: లిప్ కేర్‌గా.. టాక్సిన్ చేరకుండా..!

పంచదారను ఇంటర్నల్‌గా తక్కువ మోతాదులోనూ, ఎక్స్‌టర్నల్‌గా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
పంచదారలో నేచురల్ యాంటీఏజింగ్ గుణాలున్నాయి. షుగర్ స్క్రబ్ చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మ కణాలకు టాక్సిన్ చేరకుండా తోడ్పడుతుంది. దీర్ఘకాలంలో వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా కాపాడి చర్మం యవ్వనంగా ఉండేలా సహాయపడుతుంది. 
 
పంచదార వల్ల ఓ అద్బుతమైన బ్యూటీ బెనిఫిట్ ఏంటంటే పంచదారలో ఉండో గ్లైకోలిక్ యాసిడ్, ఉండటం వల్ల ఇది డెడ్ స్కిన్ సెల్స్ మరియు చర్మ దిగువను పేరొకొన్న దుమ్ము మరియు ధూళిని తొలిగించి చర్మాన్ని క్లీన్‌గా ఉంచుతుంది.
 
చర్మ రంధ్రాలను పూర్తిగా శుభ్రపరిచి మొటిమలను, మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. ఇది వివిధ రకాల టాక్సిన్స్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. రెండు చెంచాల పంచదారలో కొన్ని చుక్కల తేనె మరియు బాదాం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి చర్మ మీద మర్ధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇక పంచదార లిప్ కేర్‌గా ఉపయోగపడుతుంది. చాలామంది మహిళలు పెదాల మీద పొడి బారిన, ఎండిన చర్మంతో బాధపడుతుంటారు. కాబట్టి పంచదారతో పెదాలను సున్నితంగా మాయిశ్చరైజింగ్‌గా ఉంచుకోవచ్చు‌. ఆలివ్ ఆయిల్‌లో కాస్ట్రో సుగర్ వేసి బాగా మిక్స్ చేసి పెదాల మీద స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు కాంతివంతంగా సున్నితంగా మెరుస్తుంటాయి. డల్ నెస్ తగ్గిపోతుంది. ఇంకా పంచదారను లిప్ గ్లాస్‌గా కూడా ఉపయోగించి లిప్ స్టిక్ ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చేస్తుంది.