గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2014 (16:08 IST)

చర్మం తాజాదనానికి బేకింగ్ సోడా ప్యాక్!

బేకింగ్ సోడాని అందాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. చర్మం తాజాగా ఉండాలంటే.. గోరువెచ్చని నీళ్లలో కొంచెం బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడాలో కాస్త తేనె కలిపి రాసుకున్నా ఫలితం ఉంటుంది. 
 
నిమ్మరసం, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌లో బేకింగ్ సోడా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే నలుపుదనం తగ్గుతుంది. చర్మం తాజాగా మారుతుంది. 
 
దీంతో స్క్రబ్ తయారుతచేసుకోవచ్చు. ఎలాగంటే.. కాస్త బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో ముఖాల్నీ, చేతుల్నీ పాదాల్నీ రుద్దుకుంటే మృతకణాలు పోతాయి. ఎండవేడికి కమిలిన చర్మానికి బేకింగ్ సోడాతో స్వాంతన పొందవచ్చు. 
 
స్నానం చేసే నీటిలో అరకప్పు బేకింగ్ సోడా కలిపి ఆ నీళ్లతో స్నానం చేస్తే కమిలిన చర్మం తెల్లబడుతుంది. కమిలిన భాగాల్లో శుభ్రమైన వస్త్రాన్ని తడిపి, దానిపై బేకింగ్ సోడా వేసి కట్టినా ఫలితం ఉంటుంది.