గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:22 IST)

వేసవిలో జిడ్డు చర్మానికి చెక్ పెట్టాలంటే? ఇవిగోండి టిప్స్!

వేసవిలో జిడ్డు చర్మానికి చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆయిలీ స్కిన్ కలిగిన వారు ఎండలో తిరిగి ఇంటికి చేరుకోగానే.. పావు కప్పు పెరుగు, సున్నిపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఆయిలీ స్కిన్‌కు చెక్ పెట్టవచ్చు. రోజూ కీరదోస గుజ్జును ముఖానికి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.  
 
ఇంకా కీరదోస గుజ్జును పాల పౌడర్‌తో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. టమోటా రసాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే టమోటా రసం, కీరదోస, ఓట్స్ పేస్ట్‌ను 20 నిమిషాల పాటు కడిగేస్తే ఆయిలీ స్కిన్‌కు గుడ్ బై చెప్పేయవచ్చు. పాలు, కోడిగుడ్డులోని తెల్లసొన, క్యారెట్ గుజ్జు మిశ్రమం కూడా ఆయిలీ స్కిన్‌ను దూరం చేస్తుంది.  
 
ఇకపోతే.. జిడ్డు చర్మాన్ని కలిగిన వారు అప్పుడప్పుడు ఫేస్ వాష్ చేస్తుండాలి. మజ్జిగను, సున్నిపిండిని అప్పుడప్పుడు ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. కార్న్ ఫ్లోర్‌ను పెరుగు, నిమ్మరసంతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. నిమ్మరసం, ద్రాక్షరసం, కోడిగుడ్డు తెల్లసొన సమానంగా తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మం నుంచి ఉపశమనం లభిస్తుంది.