గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (15:06 IST)

సుతిమెత్తని చేతులు పొందాలంటే ఏం చేయాలి?

సుతిమెత్తని చేతులు పొందాలంటే ఉష్టోగ్రతకు తగ్గట్లు శరీరాన్ని కాపాడుకోవాలి. ఎండకు చేతులకు తొడిగే గ్లవ్స్ వాడాలి. శీతాకాలంలో గ్లోవ్స్ అనివార్యం. ఎప్పుడు రబ్బర్ గ్లవ్స్ వేసుకోకుండా ఇంటిని శుభ్రం చేయకూడదు. 
 
మృదువైన హ్యాండ్స్ కోసం.. 
*  ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి 
* ఉదయం, సాయంత్రం ఒకసారి హాండ్ క్రీంను వాడితే మంచిది.
 
* వేడి నీటికి 'నో' చెప్పండి. చర్మాన్ని వేడినీరు పొడిగా చేస్తుంది. అయితే గోరువెచ్చని నీటితో స్నానం హ్యాండ్ వాష్‌కు ఉపయోగించుకోవచ్చు. 

* శరీరానికి తగిన సోప్స్ ఎంచుకోవాలి. గాఢమైన సబ్బుల కంటే సహజసిద్ధమైన సున్నితమైన సోపులు మంచి ఫలితాలనిస్తాయి.  
 
* తేనె, బొప్పాయి వంటి ప్యాక్స్‌తో చేతులు తెలుపుగా, మృదువుగా తయారవుతాయి. 
* సన్ స్క్రీన్ క్రీములను అరచేతుల్లో ఉంచుకోండి.