శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:30 IST)

మృదువైన జుట్టుకోసం మినుముల హెయిర్ ప్యాక్ ట్రై చేయండి!

మృదువైన జుట్టు కావాలంటే మినుములతో హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. మినుమల ప్యాక్‌తో డామేజ్ హెయిర్‌తో పాటు హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేయవచ్చు. 
 
మినుముల ప్యాక్‌కు కావల్సినవి:
మినుములు: అరకప్పు, పెరుగు : అరకప్పు
 
ప్యాక్ ఎలా వేసుకోవాలంటే..? మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తగా రుబ్బుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు దృఢంగా, మృదువుగా, అందగా తయారవుతుంది.
 
గుర్తుంచుకోవల్సినవి: ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు వేసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది. మీరు తలస్నానం కోసం ఉపయోగించే షాంపూ గాఢత తక్కువగా ఉండేలా చూసుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు.