శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (11:44 IST)

బ్లాక్ హెడ్స్‌ను దూరం చేసుకోవాలంటే.. మెంతులు పేస్ట్ ట్రై చేయండి

బ్లాక్‌హెడ్స్‌కు మెంతులు పేస్ట్ బాగా పనిచేస్తాయి. సముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్న వారికి ఈ సమస్య ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే జిడ్డు చర్మమున్న ముఖంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి బ్లాక్‌హెడ్స్ వస్తుంటాయి. బ్లాక

బ్లాక్‌హెడ్స్‌కు మెంతులు పేస్ట్ బాగా పనిచేస్తాయి. సముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్న వారికి ఈ సమస్య ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే జిడ్డు చర్మమున్న ముఖంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి బ్లాక్‌హెడ్స్ వస్తుంటాయి.

బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకునేందుకు ఇంట్లో లభించే పదార్థాలతోనే నయం చేయవచ్చు. అవేంటంటే... మెంతుల్ని పేస్ట్‌లా చేసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోండి. 
 
ఈ పేస్ట్ ఆరేందుకు కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా ఓ వారం రోజులపాటు చేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి మీ ముఖారవిందం పెరుగుతోంది.