శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : శనివారం, 4 జులై 2015 (12:10 IST)

యుక్త వయస్సులో తెల్లజుట్టు... రంగు మార్చే ఆవ నూనె...

ఈ రోజుల్లో యువత ఫాస్ట్ ఫుడ్‌లు, పిజ్జాలు, బర్గర్లకు అలవాటుపడి పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతుంది. దీంతో యంగ్ ఏజ్‌లోనే హెయిర్ డైలు వేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే తలకు ఆవాల నూనె రాసుకుంటే సరి. 
 
ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మాడుకు ఆవ నూనెను రాసుకుని, సున్నితంగా మర్దన చేసుకుని ఉదయాన్నే తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మొదట జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఆ తర్వాత క్రమంగా అది నల్లబడుతుంది. 
 
ముఖంపై ముడతలతో చిన్న వయసులోనే ముసలివారిలా కనపడుతున్నారు. అయితే ఒక్కసారి ఈ ఇంటి చిట్కా చదవండి. పనసపండు తిన్నాక వాటి గింజలను పడేస్తాం. అలా కాకుండా వాటిని రాత్రంతా చల్లటి పాలలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని రుబ్బి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అలా వారానికి నాలుగైదుసార్లు చేస్తే ముడతలు తప్పకుండా తగ్గిపోతాయి.
 
ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే ముఖంపై మొటిమలు పెద్ద సమస్యగా మారతాయి. ఒక్క రాత్రి మొటిమలు తగ్గుముఖం పట్టాలంటే రాత్రి పడుకునే ముందు తెల్లటి టూత్ పేస్ట్‌ను మొటిమలపై రాసుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఉపయోగించే పేస్ట్ జెల్ కాకూడదు.