శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 16 మార్చి 2015 (18:33 IST)

క్యారెట్ ఫేస్ ప్యాక్‌తో మేలెంతో తెలుసుకోండి?

క్యారెట్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్‌లో ‘విటమిన్ ఎ'అధికంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ ఎ సున్నితమైన చర్మానికి చాలా అవసరం. ఇది నేచురల్‌గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్, సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి క్యారెట్‌ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె, పాలు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఐదు నిముషా పాటు మసాజ్ చేయాలి. 
 
ఇలా చేసిన ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మోచేతులు, మోకాళ్ళమీద కూడా రుద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మోచేతులు, మోకాళ్ళు తెల్లగా మారవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు లేదా మాసానికి ఆరు-ఎనిమిది సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మెరుగైన సౌందర్యం మీ సొంతం అవుతుందని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.