శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (12:55 IST)

ముదురు రంగు చాక్లెట్ తినండి.. అందంగా కనిపించండి..

ముదురు రంగు చాక్లెట్‌ను రోజుకొకటి తీసుకోవడం ద్వారా అందంగా కనిపించవచ్చునని.. చర్మ సౌందర్య నిపుణులు అంటున్నారు. చర్మాన్ని మెరిపించి.. మృదుత్వాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలకూరలో ఖనిజాల

ముదురు రంగు చాక్లెట్‌ను రోజుకొకటి తీసుకోవడం ద్వారా అందంగా కనిపించవచ్చునని.. చర్మ సౌందర్య నిపుణులు అంటున్నారు. చర్మాన్ని మెరిపించి.. మృదుత్వాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలకూరలో ఖనిజాలూ, విటమిన్లూ ఎక్కువ. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు.. చర్మాన్ని మెరిపిస్తాయి. వారంలో మూడు నాలుగుసార్లు పాలకూరను తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని చెప్తున్నారు.  
 
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. రోజూ కొన్ని బాదం గింజల్ని తీసుకుంటే ఆరోగ్యంగా మారుతుంది. వార్థక్యపు ఛాయలు తొందరగా తొలగిపోతాయి. చేపలు ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. తరచూ చేపలు తినడం చర్మానికీ ఎంతో మంచిది. మృతకణాలు తొలగిపోయి కొత్త కణాలు పెరుగుతాయి. 
 
గ్రీన్‌టీ: అందాన్ని కాపాడుకోవాలనుకునేవారు మామూలు టీ, కాఫీలకంటే.. దీనికి ప్రాధాన్యమివ్వాలి. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లతోపాటుయాంటీఏజింగ్‌ కారకాలు ఉంటాయి. ప్రతిరోజూ కనీసం మూడు కప్పులైనా గ్రీన్‌టీ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మం యౌవనంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.