శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (12:21 IST)

కోకోపౌడర్ బ్యూటీ టిప్స్... చర్మం నిగనిగలాడాలంటే..?

కోకో పౌడర్‌తో చర్మానికి ఎంతో మేలు చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. కోకోపొడి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీన్ని రోజూ రాసుకోవడం ద్వారా చర్మం సాగిపోకుండా ఉంటుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చే

కోకో పౌడర్‌తో చర్మానికి ఎంతో మేలు చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. కోకోపొడి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీన్ని రోజూ రాసుకోవడం ద్వారా చర్మం సాగిపోకుండా ఉంటుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. కోకోపొడిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. కోకో పౌడర్‌ ప్యాక్‌తో చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. 
 
కోకో పౌడర్‌ను వాడటం ద్వారా వయసుతో వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చు. కోకోపొడి అందుబాటులో లేకపోతే షీబటర్‌ని దానికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కోకో పౌడర్ కాపాడుతుంది. ఇది ఎక్కువ సమయం చర్మాన్ని తాజాగా, తేమగా ఉంచుతుంది. పొడిచర్మతత్వం ఉన్నవారికి ఈ పౌడర్ ఎంతో మేలు చేస్తుంది.