శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 జులై 2016 (17:30 IST)

రోజూ లేత కొబ్బరి నీరు తాగండి.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించండి!

రోజూ లేత కొబ్బరి నీరు తాగండి.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోండి అంటున్నారు న్యూట్రీషన్లు. రోజు తెల్లవారున పరగడుపున లేత కొబ్బరి నీరు తీసుకుంటే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అలాగే రోజూ నారింజ రసం తాగడం

రోజూ లేత కొబ్బరి నీరు తాగండి.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోండి అంటున్నారు న్యూట్రీషన్లు. రోజు తెల్లవారున పరగడుపున లేత కొబ్బరి నీరు తీసుకుంటే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అలాగే రోజూ నారింజ రసం తాగడం ఎంతో మంచిది. ఇందులో విటమిన్ సీ చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచుతాయి. 
 
ఇంకా రోజుకు 8 నుంచి పది గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరంలోని వ్యాధికారక మలినాలు వెలివేయబడతాయి. తద్వారా ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు.. చర్మం కాంతివంతం అవుతుంది. నిమ్మరసం, తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది.  రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెండింటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు.
 
ఇకపోతే.. కలబంద గుజ్జును ముఖానికి రాస్తే మంచి ఫలితం లభిస్తుంది. కలబంద గుజ్జును ముఖానికి పట్టించి, కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే.. కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.