శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (15:55 IST)

వేసవిలో చర్మ సౌందర్యం మెరుగుకు దోసకాయ దివ్యౌషధం!

వేసవిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు దోసకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గుజ్జుతో చర్మం ప్రకాశవంతం అవుతుంది. కేవలం దోసకాయ గుజ్జును ముఖానికి రాయడం ద్వారా చర్మానికి తేమ లభిస్తుంది. ఈ ఫేస్ మాస్క్‌ను 20 నిమిషాల తర్వాత తొలగిస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
అలాగే వేసవిలో అలోవేరా జెల్ చర్మానికి మెరుపునిస్తుంది. సన్ టాన్ నుంచి పోరాడేందుకు అలోవేరా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్‌ని ముఖానికి పట్టించి.. అరగంట తర్వాత కడిగేస్తే ఎండ వేడిమి నుంచి చర్మాన్ని కాపాడినట్లవుతుంది. ఇకపోతే నిమ్మరసం, తేనెను 1: 2 నిష్పత్తిలో కలిపి ఫ్రిజ్‌లో నిల్వచేయండి. అవసరం అనుకున్నప్పుడు, ఫ్రిజ్ నుండి ఈ నిమ్మ, తేనె ప్యాక్‌ను నేరుగా ముఖానికి అప్లై చేయవచ్చు. నిమ్మకాయ సన్ టాన్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.