శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (17:49 IST)

మృదువైన కురుల కోసం.. పెరుగుతో సూపర్ ప్యాక్!

మృదువైన కురుల కోసం పెరుగుతో ప్యాక్ వేసుకోండి. జుట్టు పొడిగా ఉంటే ఎంత అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి కురులకు పెరుగుతో హెయిర్ ప్యాక్ సాఫ్ట్ అండ్ షైనీని ఇస్తుంది. ఇంకా తేమతో కూడిన మృదువైన కురుల కోసం పెరుగు ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. 
 
గడ్డ పెరుగును పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మాడుకు పట్టించి మాస్క్‌లా వేసుకోవాలి. తర్వాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని అరగంటా పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్‌ను అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుంది.
 
గమనిక : నార్మల్ హెయిర్ ఉన్న వారు వారానికోసారి, పొడిజుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది.