గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (14:02 IST)

కరివేపాకు పొడితో మొటిమలు మటాష్.. కరివేపాకు, పసుపు పేస్ట్‌తో?

మొటిమలను కరివేపాకు పొడితో తొలగించుకోవచ్చు. కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్న చోట రాస్తే అవి తగ్గుతాయి. గుప్పెడు కరివేపాకును మెత్తగా చేసి దానికి చెంచా చొప

మొటిమలను కరివేపాకు పొడితో తొలగించుకోవచ్చు. కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్న చోట రాస్తే అవి తగ్గుతాయి. గుప్పెడు కరివేపాకును మెత్తగా చేసి దానికి చెంచా చొప్పున ముల్తానీమట్టీ, గులాబీ నీరు కలపాలి. ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది ముఖం మీద మచ్చలను, వలయాలను తగ్గించి మెరిసేలా చేస్తుంది.
 
* రెండు చెంచాల కరివేపాకు ముద్దకు మూడు చెంచాల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఆలివ్‌ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్‌, తేమ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
 
* రెండు చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటి మచ్చలు ఉన్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి.