శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (15:55 IST)

నేతిని జుట్టుకు రాసుకుంటే? చుండ్రు తగ్గిపోతుందట..

నేతికి జుట్టుకు రాసుకుంటే ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసా? నాణ్యమైన దేశీయ నెయ్యి జుట్టుకు మంచి కండిషనర్‌గా పని చేస్తుందట. వెంట్రుకల చివరలు రెండుగా చిట్లిపోతున్నట్లైతే.. మూడు చెంచాల నెయ్యి తీసుకొని వెంట్

నేతికి జుట్టుకు రాసుకుంటే ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసా? నాణ్యమైన దేశీయ నెయ్యి జుట్టుకు మంచి కండిషనర్‌గా పని చేస్తుందట. వెంట్రుకల చివరలు రెండుగా చిట్లిపోతున్నట్లైతే.. మూడు చెంచాల నెయ్యి తీసుకొని వెంట్రుకల చివర్లో రాసి 15 నిమిషాల తర్వాత తల దువ్వుకొని, మైల్డ్‌షాంపూతో కడిగేస్తే సరిపోతుంది. పొడి జుట్టు ఉన్నవారైతే.. పొడి చర్మం ఉండి చుండ్రు సమస్యతో బాధ పడేవారు నెయ్యి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
గోరువెచ్చని నెయ్యి, బాదం నూనె కలిపి వెంట్రుకల మొదళ్లలో రాసి 15నిమిషాల పాటు ఉంచి నెయ్యి పోయేలా రోజ్ వాటర్‌తో వెంట్రుకలని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు చెంచాల నెయ్యిని ఒక చెంచా ఆలివ్ నూనెతో కలిపి తల వెంట్రుకలకు రాసిన తర్వాత 20 నిమిషాల దాకా అలానే ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.