శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (16:12 IST)

పొడి జుట్టుకు 3 టిప్స్‌తో చెక్.. అవేంటి?

పొడి జుట్టును నివారించడంలో నిమ్మకాయ ఉత్తమంగా పనిచేస్తుంది. దీన్ని జుట్టుకు నేరుగా అప్లై చేయొచ్చు లేదా నిమ్మరసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకుంటే పొడి జుట్టును నివారించవచ్చు.
 
అలాగే పొడి జుట్టుకు ఫ్రూట్ హెయిర్‌ ప్యాక్‌లో అరటి ప్రధానమైనది. పొడి బారిన జుట్టుకు ఇది ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్. అరటిపండును బాగా గుజ్జులా చేసి, అందులో ఎగ్ వైట్‌ను మిక్స్ చేసి తలకు, జుట్టు మొత్తానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.
 
ఇక మూడోది డ్రై హెయిర్ నివారణకు ఆపిల్ మరో బెస్ట్ హెయిర్ ప్యాక్. షాంప్ చేసిన తర్వాత ఆపిల్ జ్యూస్‌ను మంచి కండీషనర్‌‍గా ఉపయోగించాలి. యాపిల్ సైడర్ వెనిగరల్‌లో విటమిన్ సి ఉండటం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది.