మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 25 మే 2017 (14:17 IST)

మోచేతి, మోకాళ్ల నలుపును ఇలా వదిలించుకోండి..

మోచేతి, మోకాళ్ల వద్ద గల నలుపును నిమ్మరసంతో వదిలించుకోవచ్చు. మోచేతి మడమల వద్ద గరుకుగా ఉన్నట్లైతే.. బ్లీచింగ్ ఏజెంట్ నిమ్మను ఎంచుకోవచ్చు. నలుపుగా ఉన్నచోట నిమ్మకాయ రసాన్ని రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. పద

మోచేతి, మోకాళ్ల వద్ద గల నలుపును నిమ్మరసంతో వదిలించుకోవచ్చు. మోచేతి మడమల వద్ద గరుకుగా ఉన్నట్లైతే.. బ్లీచింగ్ ఏజెంట్ నిమ్మను ఎంచుకోవచ్చు. నలుపుగా ఉన్నచోట నిమ్మకాయ రసాన్ని రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. కొన్నివారాల పాటు ఇలా చేయడం వల్ల క్రమంగా నలుపును వదిలించుకోవచ్చు. 
 
అలాగే వంటసోడా, పాలు రెండింటిని మిశ్రమంలా చేసి మోచేతులూ, మోకాళ్లపై రాయాలి. ఇలా వారానికోసారి చేస్తే కొన్నిరోజుల్లోనే మోచేతి చర్మం మృదువుగా తయారవుతుంది. కలబంద రసాన్ని నలుపుదనం ఎక్కువగా ఉన్న చర్మంపై నెమ్మదిగా మర్దన చేసి.. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇంకా మోచేతి వద్ద మోకాళ్ల నలుపును తొలగించుకోవాలంటే.. పుల్లటి పెరుగును, కొబ్బరినూనెను ఉపయోగించుకోవచ్చు. పుల్లటి పెరుగు, శెనగపిండిని సమపాళ్లలో తీసుకుని మెత్తగా కలిపిన మిశ్రమాన్ని మోచేతులకు, మోకాళ్లకు రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.