శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By JSK
Last Modified: బుధవారం, 24 ఆగస్టు 2016 (19:03 IST)

మీ అందం మీ క‌ళ్ళే... షార్ప్ లుక్స్ ఇలా కాపాడుకోండి...

మీ అందాన్ని ఇనుమ‌డింప‌జేసేది మీ క‌ళ్ళే. ఈ చూపు షార్ప్‌గా ఉంటే... ఎవ‌రైనా మీ దృష్టిలోకి ప‌డిపోతారు. క‌ళ్ళ‌ను కాపాడుకోవ‌డానిక ఆయుర్వేదం మూడు మార్గాల‌ను సూచించింది. 1. సాత్విక ఆహారం: మీరు తీసుకునే ఆహారం ఎక్కువ కారంగా, స్పైసీగా ఉండ‌కూడ‌దు. పాత బియ్యం,

మీ అందాన్ని ఇనుమ‌డింప‌జేసేది మీ క‌ళ్ళే. ఈ చూపు షార్ప్‌గా ఉంటే... ఎవ‌రైనా మీ దృష్టిలోకి ప‌డిపోతారు. క‌ళ్ళ‌ను కాపాడుకోవ‌డానిక ఆయుర్వేదం మూడు మార్గాల‌ను సూచించింది.
 
1. సాత్విక ఆహారం:  మీరు తీసుకునే ఆహారం ఎక్కువ కారంగా, స్పైసీగా ఉండ‌కూడ‌దు. పాత బియ్యం, శెన‌గ‌లు, ఆవుపాల‌తో చేసిన తినుబండారాలు, ద్రాక్ష‌, దానిమ్మ‌, మాంసం సూప్... ఇవ‌న్నీ మీ కంటి చూపును చ‌క్క‌గా కాపాడుతాయి. తీక్ష‌ణ‌మైన చూపును ఇస్తాయి. త్రిఫ‌లం అంటే తాని, ఉసిరి, నిమ్మ ఉప్పు, స్వ‌చ్ఛ‌మైన నీళ్ళు... కంటికి మెరుపునిస్తాయి. జింక్ కంటి చూపును వృద్ధి చేస్తుంది. 
 
ఇలా చేయ‌కండి:  నేరుగా సూర్యుడిని చూడ‌కండి... అలాగే పెద్ద కాంతిని, విస్పోట‌నాల‌ను నేరుగా క‌ళ్ళ‌తో చూడ‌కూడ‌దు. దూరంగా ఉండే చిన్న వ‌స్తువుల‌ను త‌దేకంగా చూడొద్దు. అలాగే రైలు, లేదా బ‌స్సు ప్ర‌యాణాల్లో పుస్త‌కాలు చ‌ద‌వ‌కండి. వాహ‌నం క‌దిలిక‌ల వ‌ల్ల దృష్టి నిల‌ప‌లేక‌... అవి మీ కంటిని బాగా శ్ర‌మ‌పెడ‌తాయి. 
 
ఎండ‌లో నుంచి వ‌చ్చిన వెంట‌నే చ‌ల్ల‌ని నీటితో త‌లస్నానం చేయ‌కూడ‌దు. అలాగే చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం నుంచి వ‌చ్చి వెంట‌నే వేడి నీళ్ళ స్నానం చేయ‌కూడ‌దు. చ‌లువ క‌ళ్ళ‌ద్దాలు లేకుండా ఎండ‌లోకి వెళ్ళ‌వ‌ద్దు. అలా చేస్తే దీర్ఘ‌కాలంలో కంటి శుక్లాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
 
చిన్నచిన్న చిట్కాల‌తో కంటికి మంచి...
- భోజ‌నం చేసే ముందు కంటి రెప్ప‌ల‌పై అర‌చేతిని ఉంచి కాసేపు మ‌ర్ద‌నా చేయండి.
- అలాగే, మీ చూపుడు వేలిని అర‌చేతితో రుద్ది... ఆ వేడిమిని మీ కంటి రెప్ప‌ల‌కు అందించండి. 
- రోజుకు క‌నీసం మూడుసార్లు చ‌ల్ల‌టి నీటితో క‌ళ్ళ‌ను శుభ్రం చేసుకోండి. అయితే, ఆ నీళ్ళు మాత్రం ప‌రిశుభ్రంగా ఉండాలి. ప్యూర్ రోజ్ వాట‌ర్ వాడొచ్చు.
-  క్యారెట్ జ్యూస్, ఆకు కూర‌లు, పండ్లు కంటి దృష్టిని వృద్ధి చేస్తాయి.