మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2015 (16:29 IST)

ఫేస్ వాష్ టిప్స్: ముఖం కడిగేటప్పుడు గట్టిగా రుద్దుతున్నారా?

చర్మాన్ని బట్టి ఫేస్ వాష్ చేసుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. జిడ్డుచర్మం ఉన్నవాళ్లైతే ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్‌ని వాడాలి. మొటిమలతో బాధపడుతుంటే సాల్సిలిక్ ఆమ్లం ఉన్న ఫేస్ వాష్ వాడితే మొటిమలు తగ్గిపోతాయి. పొడిచర్మంగల వారు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ అయిన కలబంద, గ్లిజరిన్, విటమిన్-ఇ ఉన్న ఫేస్ వాష్‌లను వాడాలి. 
 
సున్నితమైన చర్మం గలవారు ఆల్కహాల్, పరిమళాలేవి లేని ఫేస్ వాష్ వాడాలి. ఎందుకంటే ఘాటైన ఫేస్ వాష్‌లను సున్నితమైన చర్మం తట్టుకోలేదు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖం కడుక్కునేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. అలాగే ఎక్కువ సేపు ఫేస్ వాష్ నురగను ముఖంపై ఉంచకూడదు. ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.