బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2016 (12:04 IST)

నాజూకైన శరీరం కోసం కొన్ని చిట్కాలు

మీ శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, వారం అంతా ట్రెడ్మిల్ యంత్రంపై పరుగులు తీయడం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. మనం ఆరోగ్యం, ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ టిప్స్‌ని పాటిస్తే నాజూకైన శరీరం ఎప్పుడు మీ సొంతం అవుతుంది.
 
సాధ్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం మంచిది. మీ రోజు వారి వ్యాయమంలో సరిసమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే వ్యాయామం చేయడం చాలా అవసరం. మీరు తీసుకునే భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం  అవసరం, సమాన్యంగా అన్నింటిలో కొవ్వు,క్యాలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకోవటం వల్ల మీరు లావుగా మారే ప్రమాదం ఉంది.
 
వ్యాయామం చేయడం చాలా అవసరం. ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 6-8 లీటర్ల నీరు తప్పకుండా తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, చాక్లెట్ బార్లు, వెన్న వంటి పదార్దాలు లేని ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.