గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (17:04 IST)

పాదాలను కూడా కాస్త పట్టించుకోండి.. 14 రోజులకోసారి పెడిక్యూర్ తప్పనిసరి

అధిక శారీరక శ్రమ కారణంగా శరీర బరువును పాదాలే భరిస్తాయి. అలాంటప్పుడు పాదాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ముందుగా వేడి నీటిలో పాదాలను అరగంట నానబెట్టాలి. పాదాల్లో పగుళ్లు ఏర్పడితే 14 రోజులకు ఓసారి పెడిక్యూర

పనిఒత్తిడి, హడావుడిలో పడి పాదాలను పెద్దగా పట్టించుకోని మహిళలు మీరైతే ఈ టిప్స్ పాటించండి. వారానికోసారైనా ఈ టిప్స్ పాటిస్తే మృదువైన కోమలమైన పాదాలు మీ సొంతం అవుతాయని పెడిక్యూర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
* అధిక శారీరక శ్రమ కారణంగా శరీర బరువును పాదాలే భరిస్తాయి. అలాంటప్పుడు పాదాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ముందుగా వేడి నీటిలో పాదాలను అరగంట నానబెట్టాలి. పాదాల్లో పగుళ్లు ఏర్పడితే 14 రోజులకు ఓసారి పెడిక్యూర్ తప్పనిసరి.
 
* ఇంకా పాదాల్లోని పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఆముదం ఒక స్పూన్, పనీర్ రెండు స్పూన్లు, నిమ్మరసం ఒక స్పూన్.. మూడింటిని ఓ బౌల్‌లో కలుపుకోవాలి. వేడినీటిలో పది నిమిషాల పాటు పాదాలను నానబెట్టి.. ఆపై పగుళ్లకు నూనె మిశ్రమాన్ని పూతలా రాసుకుంటే పగుళ్లు దూరమవుతాయి.  
 
* ఉప్పు, షాంపూ, నిమ్మరసం కలిపిన వేడినీటిలో కాళ్లను నానబెట్టి ఆపై నునుపు రాతితో పాదాలను శుభ్రం చేసుకున్నట్లైతే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.