గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:41 IST)

మెరుపులీనే ముఖ సౌందర్యానికి... ఫ్రూట్ ప్యాక్

సాధారణంగా యాపిల్, అరటి వంటి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అవే పండ్లతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌ ద్వారా మెరిసేటి ముఖ సౌందర్యం పొందవచ్చును. 
 
అరటి పండుః
అందరికీ అందుబాటులో ఉండే అరటి పండును బాగా మగ్గించి, దాన్ని మెత్తగా గుజ్జులా చేయాలి. ఆ గుజ్జును ముఖానికి రాసుకోవాలి. మొటిమల సమస్య ఉంటే గుజ్జుకు కొంచెం తేనె లేదా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. 
 
యాపిల్ పండు :
యాపిల్‌ పండును గుజ్జులా చేసి దానిలో కొద్దిగా తేనె కలపాలి. ఆ పేస్టును ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి ముఖానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నునుపు దేలుతుంది.
 
ద్రాక్షపళ్లు :
నోరూరించే ద్రాక్షా పళ్ల మొటిమలను దూరం చేస్తాయి. మొటిమలతో బాధపడేవాళ్లు ద్రాక్షపళ్ల గుజ్జును ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది. ద్రాక్షపళ్ల గుజ్జును ముఖానికి రాసుకుని అది ఎండిపోయేవరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ద్రాక్షపళ్ల ఫేస్‌ ప్యాక్‌తో ముఖం మీద ఏర్పడ్డ చిన్న మచ్చలు సైతం పోతాయి.
 
బొప్పాయి పండు :
బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును తీసి మెత్తగా చేసి దాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. 
 
స్ట్రాబెర్రీ :
ఒకప్పుడు ధనిక వర్గానికే ఉన్న పండు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. డల్‌ స్కిన్‌కు స్ట్రాబెర్రీ ఫేస్‌ప్యాక్‌ చాలా మంచిది. స్ట్రాబెర్రీస్‌కు కొద్దిగా నీటిని జోడించి మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ గుజ్జును ముఖానికి రాసుకుని ఎండిపోయేదాకా అలాగే ఉంచుకోవాలి. మిక్స్డ్‌ ఫ్రూట్‌ ప్యాక్‌ కూడా రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
టమోటా:
వంటింటి యువ రాణిగా చెప్పబడే టమోటా రుచికరమైన ఆహారం తయారీకే కాదు, చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడూ నూనెలు కక్కుతూ జిడ్డు చర్మం ఉన్నవారికి టొమాటో మాస్క్‌ చాలా బాగా పనిచేస్తుంది. టొమాటోను పిండి ఆ రసాన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపు అలాగే ఉంచుకున్న తర్వాత ముఖాన్ని నీళ్లతో కడిగేసుకోవాలి.