గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (13:22 IST)

మొటిమల్ని దూరం చేసే దోసకాయ గుజ్జు, పాలు

మొటిమల వల్ల అందవిహీనంగా మారిపోతుంటారు.. చాలామంది మహిళలు. అలాంటి మొటిమలను వంటింటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. మొటిమలను తొలగించడంలో టమోటో - నిమ్మకాయ భేష్‌గా పనిచేస్తుంది.

మొటిమల వల్ల అందవిహీనంగా మారిపోతుంటారు.. చాలామంది మహిళలు. అలాంటి మొటిమలను వంటింటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. మొటిమలను తొలగించడంలో టమోటో - నిమ్మకాయ భేష్‌గా పనిచేస్తుంది. 
 
టమోటా, నిమ్మరసాన్ని రెండింటిని ముఖానికి జ్యూస్‌లా చేసుకుని ముఖానికి పట్టించినట్లైతే.. మొటిమలు దూరమవుతాయి. కలబంద గుజ్జును, నిమ్మకాయ రసాన్ని కలిపి ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా ముఖం ప్రశాంతవంతంగా మారుతుంది. 
 
అలాగే ఉల్లిపాయ రసంతో మొటిమల్ని అరికట్టవచ్చు. చిటికెడు పసుపు, చిటికెడు నిమ్మరసాన్ని కలిపి వచ్చే పేస్టును మొటిమలు ఉండే ప్లేస్‌లో అప్లైయ్ చేస్తే ఎలాంటి మచ్చలైనా తొలగిపోతాయి. బంగాళదుంప ముక్కల్ని మొహంపై ఉన్న మచ్చలపై రుద్దితే ఫలితం ఉంటుంది. నిమ్మకాయ రసం అన్నీరకాల చర్మవ్యాధుల్ని అరికడుతుంది. 
 
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల విషపు కణాలు దూరం చేస్తుంది. మొహంపై ఉన్న మచ్చల్ని అరికట్టాలంటే నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. దోసకాయ గుజ్జు పాల మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.