గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (15:08 IST)

ఆరోగ్యానికే కాదు.. అందానికీ గ్రీన్ టీ మేలు..!

గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానీకీ మేలు చేస్తుంది. గ్రీన్ టీ లో చెంచా తేనె కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక పూతలా వేయాలి. ఇలా పది హేను నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
కొన్నిసార్లు ఎండలో తిరిగి ఇంటికి వచ్చినపుడు ముఖం చాలా డల్‌గా అనిపిస్తుంది. అటువంటి సమయంలో ఈ పూత వేసుకుంటే చర్మానికి ఉపశమనం కలగడమే కాకుండా ముఖ తేజస్సు పెరుగుతుంది. 
 
అలానే చర్మం కాంతి విహీనంగా అనిపిస్తుంటే గ్రీన్ టీ ని కాచి చల్లార్చి కాసేపు ఫ్రీజ్‌లో పెట్టాలి. దానిలో చెంచా పంచదార కలిపి కరగకుండానే ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. దీనివల్ల మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. 
 
కొందరికి చర్మం ముడతలు పడి అసలు వయసు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివారు  నాలుగు చెంచాల గ్రీన్‌టీలో గుడ్డులోని తెల్లసొనను కలిపి బాగా గిలకొట్టాలి. దీన్ని చర్మానికి రాసుకుని ఆరాక కడిగేసుకుంటే సరి. ఇలా కనీసం వారానికోసారి చేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.