బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (21:39 IST)

జుట్టు పెరగటానికి ఉల్లిపాయలు తీసుకుంటే?

జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఉల్లిపాయలు తీసుకుండే మంచిది. వీటిని రసంగా చేసుకుని జుట్టుకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయల నూనె వాడటం ద్వారా జుట్టు వొత్తుగా పెరుగుతుంది. మగవారిలో బట్టత

జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఉల్లిపాయలు తీసుకుండే మంచిది. వీటిని రసంగా చేసుకుని జుట్టుకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయల నూనె వాడటం ద్వారా జుట్టు వొత్తుగా పెరుగుతుంది. మగవారిలో బట్టతలను కూడా ఉల్లిపాయ నూనె తొలగిస్తుంది. మూడు ఉల్లిపాయలు, 4 దాల్చిన చెక్కముక్కలు తీసుకుని వీటిని బాగా పొడిచేసి అందులో స్పూన్ ఉసిరికాయ పొడిని కలుపుకుని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తరువాత స్నానం చేయాలి.
 
ఇలాచేయడం వల్ల జుట్టు బాగా వొత్తుగా పెరుగుతుంది. ఒక బౌల్‌ని తీసుకుని అందులో కాస్త కొబ్బరి నూనెను వేసి బాగా వేడిచేసిన తరువాత దాల్చిన చెక్కపొడి, కరివేపాకు వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత అందులో ఉసిరిపొడిని వేసి 2 నిమిషాలు మరిగించుకుని కాసేపటి తరువాత ఆ మిశ్రమంలో ఉల్లిపాయలు వేసి బాగ మరగనివ్వాలి.
 
ఆ మిశ్రమం గోల్డెన్ రంగులో వచ్చేంతవరకు అలానే ఉంచుకోవాలి. అలా వచ్చిన తరువాత దానికి దించుకుని చల్లారాక వడగట్టి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు సార్లు తలకు పట్టించి రెండుమూడు గంటల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు అందంగా పొడవుగా పెరుగుతుంది.