శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (18:26 IST)

కొబ్బరి నీళ్లు తాగండి.. కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోండి.!

కొబ్బరి నీళ్లు తాగండి.. కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోండి అంటున్నారు సౌందర్య నిపుణులు. జుట్టు పెరుగుదలను కొబ్బరి పాలు ఎంతో మేలు చేస్తుంది. జుట్టుకు తగినంత క్యాల్షియం అందిస్తుంది. రోజులో 1/2 కప్పు కొబ్బరి నీరు త్రాగవచ్చు. అలాగే నూనెలతో తలపైన మసాజ్ చేయటం వలన జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 
 
రోజూ నిద్రించేందుకు ముందు రెండు చెంచాల నూనెను తలకు రాయండి. చేతి వేళ్ళతో మాడుకు, వెంట్రుకలకు మసాజ్ చేయడం ద్వారా శిరోజాలు మృదువుగా తయారవుతాయి.

అలాగే యోగా చేయటం వలన మెడ మరియు తలకు సంబంధించిన భాగాలలో కలిగే ఒత్తిడి శక్తివంతంగా తగ్గించబడుతుంది, అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. యోగాల వలన కేశాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.