బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (15:36 IST)

కేశాల చిక్కుముడలకు చిట్కాలతో చెక్ : బనానా ప్యాక్!

కేశాల చిక్కుముడలకు చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి. జుట్టులో ఎక్కువగా ముడులు ఉన్నప్పుడు తలకు నూనె పట్టించి ఆయిల్ మసాజ్ చేయాలి. తర్వాత దువ్వెనతో నిదానంగా దువ్వుతూ ముడులను తొలగించాలి. నిద్రించేందుకు ముందు కేశాలను దువ్వుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు చిక్కుబడకుండా ఉంటుంది. జుట్టు పొడవుగా త్వరగా పెరిగేందుకు సహాయపడుతుంది.   
 
కేశాల్లో ముడులు లేదా చుక్కను తొలగించుకోవడానికి హెయిర్ బ్రష్ వాడుకోవచ్చు. టూత్ కూంబ్‌తో కేశాలను పైనుండి క్రింది వరకూ ఒకే లెవల్లో దువ్వడం వల్ల, చిక్కుబడిన జుట్టు నేచురల్‌గా వదులుతుంది. అప్పటికి చిక్కు విడవకుంటే కొద్దిగా లోషన్ అప్లై చేసి దువ్వుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత, జుట్టు ముడులుగా ఏర్పడుతుంది. తలలో ముడులను లేదా చిక్కును నివారించడానికి బటర్‌ను తలకు పట్టించాలి. 
 
అరటిపండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా పాలు పోసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. తర్వాత దువ్వెనతో దువ్వడం వల్ల చిక్కు పోతుంది. అంతేకాదు తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు మంచి షైనింగ్‌ను అందిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.