శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CHJ
Last Modified: బుధవారం, 6 ఏప్రియల్ 2016 (21:43 IST)

నిగనిగలాడే కేశ సంపద కోసం.... తప్పకుండా ఇవి చూడండి....

జుట్టు పొడిబారుతోంది అంటే తగిన పోషణ లేదని అర్థం. అలాగే నిర్లక్ష్యం చేస్తే కుదుళ్లు బలహీనపడటం, జుట్టురాలిపోవడం, జుట్టు చివర్లు పగిలిపోవడం జరుగుతుంది. అయితే ఈ సమస్యను ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అధిగమించవచ్చు.

జుట్టు పొడిబారుతోంది అంటే తగిన పోషణ లేదని అర్థం. అలాగే నిర్లక్ష్యం చేస్తే కుదుళ్లు బలహీనపడటం, జుట్టురాలిపోవడం, జుట్టు చివర్లు పగిలిపోవడం జరుగుతుంది. అయితే ఈ సమస్యను ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అధిగమించవచ్చు. 
 
• వెన్నతో మసాజ్‌: పొడిబారినట్టుగా ఉండి, శిరోజాల చివర్లు చిట్లిపోతే వెన్నతో మసాజ్‌ చేసుకోవాలి. తరువాత షవర్‌ క్యాప్‌తో శిరోజాలను కవర్‌ చేసుకుని అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి.
 
• ఆలివ్‌ ఆయిల్‌తో: పొడిబారిన జుట్టు మెత్తగా, పట్టులా కావాలంటే గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌ను శిరోజాలకు పట్టించాలి. నలభైఐదు నిమిషాల తరువాత షాంపూ స్నానం చేసుకోవచ్చు.
 
• బ్లాక్‌టీతో: పొడిబారిన జుట్టు సహజసిద్దమైన మెరుపును సొంతం చేసుకోవాలంటే బ్లాక్‌టీని జుట్టుకు పట్టించండి. బ్లాక్‌టీ జుట్టు రంగును మెరుగుపరచడమే కాకుండా, మెరుపునిస్తుంది.
 
• గుడ్డుపచ్చసొన: జుట్టు దెబ్బతింటోంది అంటే సరైన పోషణ లేదని అర్థం. జుట్టుకు సరైన పోషకాలు అందాలంటే గుడ్డు పచ్చసొనను పట్టించండి. ఇది కండిషనర్‌గా, మాయిశ్చర్‌గా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొనను జుట్టుకు పట్టించాక ఒక గంటపాటు వదిలేసి తరువాత పర్‌ఫ్యూమ్డ్‌ షాంపూతో స్నానం చేయాలి.
 
• అవకడో, కొబ్బరి పాలు: అవకడోలో ఉండే నూనె, కొబ్బరిపాలు దెబ్బతిన్న జుట్టును బాగుచేయడానికి అద్భుతంగా ఉపకరిస్తాయి. ఒక అవకడోను తీసుకుని పేస్ట్‌ మాదిరిగా చేసి అందులో గుడ్డు పచ్చసొన, కొబ్బరిపాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చిన్నగా తలపై మర్దన చేస్తూ జుట్టుకు పట్టించాలి. ఒక అరగంటపాటు అలా వదిలేసి తరువాత షాంపూతో స్నానం చేయాలి.
 
• అరటిపండు, ఆల్మండ్‌ ఆయిల్‌: అరటిపండులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది జుట్టు మృదువుగా కావడానికి దోహదపడుతుంది. ఆల్మండ్‌ ఆయిల్‌లో ఉండే విటమిన్‌- ఇ జుట్టుకు తేమను, పోషణను అందిస్తుంది. అరటిపండు, ఆల్మండ్‌ అయిల్‌ కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
 
• యాపిల్‌ సిడెర్‌ వెనిగర్‌ మాస్క్‌ : దెబ్బతిన్న జుట్టుకు అద్భుతమైన హోమ్‌ రెమిడీ ఇది. ఒక టీస్పూన్‌ యాపిల్‌ సిడెర్‌ వెనిగర్‌, రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, మూడు ఎగ్‌వైట్లు కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. తరువాత షవర్‌ క్యాప్‌తో హెయిర్‌ను కవర్‌ చేసి పెట్టాలి. అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి.
 
• తేనె: హెయిర్‌ ఫాలికిల్స్‌కు తగిన పోషణ కావాలంటే తేనె ఒక్కటే మార్గం. తేనెలో కొంచెం నీరు కలిపి జట్టుకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
 
• పెరుగు: పొడిబారిన జుట్టుకు పెరుగు సహజ కండిషనర్‌గా ఉపకరిస్తుంది. ఒక టీస్పూన్‌ యాపిల్‌ సిడెర్‌ వెనిగర్‌, ఒక టీస్పూన్‌ తేనె, అరకప్పు పెరుగు కలిపి కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.