శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (17:02 IST)

బొప్పాయి గుజ్జుతో చిట్లిన జుట్టుకు చెక్

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అయితే బొప్పాయి ప్యాక్ ట్రై చేయండి. అరకప్పు బొప్పాయి గుజ్జులో పావుకప్పు పెరుగు కలిపి తలకు పట్టించాలి. కురులకు సైతం పట్టించి.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అయితే బొప్పాయి ప్యాక్ ట్రై చేయండి. అరకప్పు బొప్పాయి గుజ్జులో పావుకప్పు పెరుగు కలిపి తలకు పట్టించాలి. కురులకు సైతం పట్టించి.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తే జుట్టు మృదువుగా తయారవుతాయి. చివర్లలో చిట్లిపోవడం కూడా తగ్గిపోతుంది. 
 
కోడిగుడ్డు పచ్చసొనలో పావుకప్పు ఆముదం, చెంచా తేనెను చేర్చి బాగా కలుపుకోవాలి. దీన్ని మాడుకు జుట్టుకు రాసుకువి అరగంట తర్వాత కడిగేస్తే పొడిబారిన జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. జుట్టు రాలుతుంటే.. బంగళాదుంపను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బంగాళా దుంప రసంలో రెండు పెద్ద చెంచాల కలబంద గుజ్జు, తేనె కలిపి తలకు రాసుకుని మర్దన చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 
 
మెంతులు చుండ్రునే కాదు.. జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తాయి. మెంతుల్ని ఓ రాత్రంతా నానబెట్టి మర్నాడు ముద్దలా చేసుకోవాలి. అందులో పావుకప్పు పెరుగు కలిపి తలకు రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక కడిగేయాలి.
 
జుట్టు కుదుళ్లు బలంగా మారాలంటే.. తలకు అరటిపండు పూత వేయాలి. బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌నూనె కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.