శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 16 మే 2015 (10:30 IST)

జుట్టు రాలడానికి కాలుష్యమే కారణం.. చేప, వాల్ నట్ ఆయిల్ వాడితే?

జుట్టు రాలుతున్నాయని ఏవేవో షాంపూలను వాడి ప్రయోగాలు చేస్తున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి. జుట్టు రాలడానికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యమని, చుండ్రు అని  బ్యూటీషన్లు అంటున్నారు.

అయితే కారణాలేవైనా పరిష్కారాలు మాత్రం అందరికీ అందుబాటులోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో మార్పులతో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు.
 
అంతేగాకుండా రోజువారీ డైట్‌లో చేప, వాల్ నట్ ఆయిల్ వాడకం ద్వారా జుట్టుకు పోషకాలు అందించవచ్చని బ్యూటీషన్లు అంటున్నారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆహారంలో సమపాళ్లుగా తీసుకుంటే జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చని వారు సూచిస్తున్నారు.

స్త్రీలు 55 గ్రాములు, పురుషులు 65 గ్రాముల ప్రోటీన్ల చొప్పున రోజూ తీసుకుంటే జుట్టుకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు తీసుకుంటే కిడ్నీలు, కాలేయంపై భారం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.