గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (12:36 IST)

అరటిపండు గుజ్జు, నిమ్మరసాన్ని జుట్టుకు రాసుకుంటే..?

జుట్టు చిట్లి పోతుందని బాధపడుతున్నారా.. వద్దు వద్దు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి కనుక ఎటువంటి సమస్య ఉండదు. నిమ్మరసంలో కొద్దిగా లావెండర్ ఆయిల్, గుడ్డు తెల్లసొన కలుపుకుని తలకు రాసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు చిట్లకుండా ఒత్తుగా పెరుగుతుంది.
 
అవకాడో మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకుని వెంట్రుకలకు రాసుకోవాలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దాంతో జుట్టు చిల్లకుండా మృదువుగా మారుతుంది. బాదం నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నిషియం, విటమిన్ ఎ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నూనెను జుట్టుకు రాసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. 
 
అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాయాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అరటిపండులోని కార్బోహైడ్రేట్స్ జుట్ట చిల్లడం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.