మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 30 జులై 2018 (14:09 IST)

ఆకుకూరలతో జుట్టు రావడం తగ్గిపోతుందా?

ఆకుకూరలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతాయి. ఒక కప్పు పొన్నగంటి కూర, గోరింటాకు పొడి, 2 స్పూన్ల మెంతిపొడి, అరకప్పు పెరుగు, స్పూన్ నిమ్మరసం, నీళ్లను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తరువాత

ఆకుకూరలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతాయి. ఒక కప్పు పొన్నగంటి కూర, గోరింటాకు పొడి, 2 స్పూన్ల మెంతిపొడి, అరకప్పు పెరుగు, స్పూన్ నిమ్మరసం, నీళ్లను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
ఒక కప్పు చుక్కకూర, గోరింటాకు పొడి, 2 స్పూన్స్ ముల్తాని మట్టీ, కప్పు పెరుగు కలిపి బాగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు నిగనిగలాడడమే కాకుండా పట్టుకుచ్చులా పెరుగుతుంది. మజ్జిగలో చింతచిగురు, గోరింటాకుపొడి, అరకప్పు శెనగపిండిని కలుపుకోవాలి.
 
ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకునే ముందు జుట్టుకు నూనెను పెట్టుకోవాలి. 2 కప్పులు అవిసె ఆకులు, కప్పు గోరింటాకు, అరకప్పు ఉసిరిపొడి వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టింటి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. 
 
గోరింటాకు పొడిలో స్పూన్ లవంగాల పొడి, కప్పు డికాషన్, కోడిగుడ్డు, కొద్దిగా పెరుగు, స్పూన్ ఆముదం నూనెను కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఆ తరువాత నూనెను రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన తెల్లజుట్టు కాస్త నల్లజుట్టుగా మారుతుంది. అదేవిధంగా జుట్టు రాలకుండా ఉంటుంది.