శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By ivr
Last Modified: గురువారం, 5 నవంబరు 2015 (15:12 IST)

ఎప్పుడూ ఒకే షాంపూ వాడరాదా...? ఎంత నురగొస్తే అంత మంచిదా...?

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా ఒత్తుగా ఉండేవారి జుట్టు కూడా ఊడిపోయి మాడు పల్చబడిపోతోంది. దీనికితోడు కొన్ని అపోహలు కారణంగా ఉన్న జుట్టును కాస్తా పోగొట్టుకుని బట్టతలతో దర్శనమిస్తుంటారు. కానీ జుట్టుకు సంబంధించి చాలామటుకు కొన్ని అపోహలను పాటిస్తుంటారు కొందరు. అవేంటో ఒకసారి చూద్దాం...
 
చన్నీటి స్నానం చేస్తే జుట్టు మెరుస్తుందని కొందరు రోజూ చన్నీటి స్నానం చేస్తుంటారు. ఇందులో కొద్దిగా నిజమున్నప్పటికీ తరచూ అలాంటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. 
 
ఎప్పుడూ ఒకే షాంపును వాడకూడదని చాలామంది అనకుంటుంటారు. అందువల్ల నెలకోసారి షాంపూలను మార్చుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. జుట్టు ఆరోగ్యానికి ఇలా షాంపూలను మార్చుకోవడంతో ఎలాంటి సంబంధం ఉండదు. జుట్టు తత్వాన్ని బట్టి ఒకే షాంపూను వాడితే సరిపోతుంది. 
 
ఎంత నురుగ వస్తే అంత మంచిదని, తలకు కనీసం రెండుసార్లు షాంపూ వాడాలని కొందరు అపోహపడుతుంటారు. ఇందులోనూ నిజం లేదు. జుట్టుకున్న మురికి ఒదిలిపోయిందని అనకుంటే ఒక్కసారి షాంపూను వాడేసి వదిలేస్తే సరిపోతుంది. నురగ బాగా రావాలని ఎక్కువసార్లు షాంపూను తలకు పట్టిస్తే జుట్టుకు సమస్య తెచ్చి పెడుతుందది.