మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 1 జులై 2014 (15:59 IST)

ముఖ తేజస్సును పెంచే కొబ్బరి!

కేవలం మానవ ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కావలసినన్ని పోషకాలు సంమృద్ధిగా లభించే వాటిలో కొబ్బరికాయ ముఖ్యమైనది. ఇటువంటి కొబ్బరి ఆరోగ్యానికే కాక ముఖం ప్రకాశమంతంగా మెరిసేందుకు సహకరిస్తుంది. 
 
కాస్త కొబ్బరిని తీసుకుని నూరి అందులో కొబ్బరి నీటిని కలిపి ముఖానికి మెడకు రాసుకుని ఆరాక కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం మీద మచ్చలు పోయి ప్రకాశవంతంగా తయారవవుతుంది. 
 
ఎండా కాలంలో బయట తిరిగి కమిలిన ముఖంతో బాధపడేవారు రెండు స్పూన్ల కొబ్బరి పాలు, ఒక స్పూన్ శెనగ పిండిని తీసుకుని కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని ఆరాక కడిగేస్తే సరి. కొంతమంది చర్మం చాలా సున్నితమైంది అలాంటి వారు ఈ చిట్కాను పాటిస్తే ఎండ నుంచి తమను తాము కాపాడుకోగలరు.