శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (17:14 IST)

మందార పువ్వుల నూనెను జుట్టుకు రాసుకుంటే?

ఈ కాలంలో ఉన్న కాలుష్యానికి జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా జుట్టు పెరగడానికి మార్కెట్లలో దొరికే రకరకాల నూనెలను వాడుతున్నా ఎలాంటి ప్రయోజనాలుండవు. అందువలన ఇంట్లో దొరికే మందార పువ్వులతో తయారుచేసే నూనెను జుట్టుకు రాసుకోవ

ఈ కాలంలో ఉన్న కాలుష్యానికి జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా జుట్టు పెరగడానికి మార్కెట్లలో దొరికే రకరకాల నూనెలను వాడుతున్నా ఎలాంటి ప్రయోజనాలుండవు. అందువలన ఇంట్లో దొరికే మందార పువ్వులతో తయారుచేసే నూనెను జుట్టుకు రాసుకోవడం వలన జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా పొడిబారకుండా ఉంటుంది.
 
మందార ఆకులు లేదా పువ్వులను శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనెలో వేసుకుని పొగలు వచ్చేవరకూ వేడి చేసుకోవాలి. చల్లారిన తరువాత నూనెను వడపోయాలి. ఇక ఆ నూనెను జుట్టుకు రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచుకోవాలి.
 
ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తరువాత కండీషనర్ రాసుకుని జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా తయారవుతుంది.