గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (17:15 IST)

డ్యామేజ్ హెయిర్‌కు హోం మేడ్ హెయిర్ ప్యాక్!

జుట్టు చివర్లు చిట్లిపోయి జుట్టు రాలిపోతోందా అయితే వెంటనే పెరుగు విత్ మెంతులతో హోం మేడ్ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. మెంతి పేస్ట్‌ను పెరుగులో చేర్చి పేస్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. 
 
ఈ పేస్ట్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకూ, మాడుకు పట్టించి గంట పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.