శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (17:16 IST)

ఆవు వెన్నను తలకు రాసుకుని గంట తర్వాత స్నానం చేస్తే?

లేటు వయసులో తల జుట్టు నెరసిపోవడం మామూలే. అయితే చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతే మాత్రం ఈ చిట్కాలు పాటించాలి. ఇంకా జుట్టు నెరవకుండా ఉండాలంటే.. కరివేపాకు తగిన మోతాదులో తీసుకోవాలి. ఆవు వెన్నను తలకు రాసుకొ

లేటు వయసులో తల జుట్టు నెరసిపోవడం మామూలే. అయితే చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతే మాత్రం ఈ చిట్కాలు పాటించాలి. ఇంకా జుట్టు నెరవకుండా ఉండాలంటే.. కరివేపాకు తగిన మోతాదులో తీసుకోవాలి. ఆవు వెన్నను తలకు రాసుకొని ఒక గంట తరువాత కుంకుడుకాయలతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు నిత్యం ఆహారంలో ఆవు వెన్న‌ను తీసుకుంటే ఎంతో మంచిది. 
 
* ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడతాయి. క‌నుక వాటిని నియంత్రించుకోవ‌డం ఎంతైనా మంచిది.
* తీసుకునే ఆహారంలో విటమిన్‌లు, పోషకవిలువల లోపం వల్ల కూడా జుట్టు బలహీన‌మై, తెల్లబ‌డుతుంది.
 
* కొద్దిపాటి అల్లం తురుములో కాస్తంత తేనే క‌లిపి ఆ..మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక టీస్పూన్‌ చొప్పున తీసుకుంటే జుట్టు పెరుగుతుంది.
 
*  తాజా ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగిన తరువాత దానిని దించి, చల్లారిన తరువాత వడకట్టి ఆ..మిశ్రమాన్ని రోజూ నూనెగా రాసుకోండి.