శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (18:02 IST)

ఆరోగ్యానికే కాదు.. అందానికీ టమోటో మేలు..

కూరల్లో యువరాణిగా వెలిగే టమోటో పోషకాల పుట్ట అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని కూరల్లోనూ టమోటో కనిపిస్తుంటుంది. అందులో విటమిన్లూ, పోషకాలూ కావల్సినన్ని ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు సౌందర్య పోషణకు చక్కగా ఉపయోగపడతాయి. చెంచా చొప్పున టొమాటో రసం, తేనె వేసి కలిపి ముఖానికి పట్టించాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖానికి మెరుపొస్తుంది. 
 
రెండు చెంచాల టమోటో రసంలో మూడు చెంచాల మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి అర గంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది. ఒక టమోటోని మెత్తగా చేసి దానికి చెంచా పెరుగూ, అరచెంచా తేనె, మూడు చెంచాల సెనగపిండీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరాక కడిగేస్తే ఫలితం ఉంటుంది.
 
రెండు చెంచాల టమోటో గుజ్జులో, చెంచా కీరదోస గుజ్జూ, రెండు చెంచాల ఓట్స్ పొడీ, చెంచా పుదీనా ఆకుల మిశ్రమం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌తో ముఖానికి తాజాదనం వస్తుంది. ఒక టమోటోని గుజ్జులా చేసి దానికి చెంచా నిమ్మరసం, అర చెంచా ఓట్స్ పొడీ కలిపి ముఖానికి రాసుకుని, కాసేపు వేళ్లతో రుద్దాలి. తరువాత చన్నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.