మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (18:30 IST)

వేసవిలో హెయిర్‌కు స్ట్రాబెర్రీ మాస్క్ వేసుకుంటే..?

వేసవిలో హెయిర్‌కు స్ట్రాబెర్రీ మాస్క్ వేసుకుంటే శిరోజాలు మృదువుగా తయారవుతాయి. స్ట్రాబెర్రీ గుజ్జు, కొబ్బరి నూనె, తేనె మూండింటిని మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. 
 
అలాగే గుడ్డులోని పచ్చసొన, గ్రీన్ టీ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలే సమస్యను దూరం చేసుకుంది. ఒక గుడ్డులోని పచ్చసొన, రెండు చెంచాల గ్రీన్ టీ మిక్స్ చేసి తలలో జుట్టు మొదల్ల నుండి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మీకు కనుక డ్రై హెయిర్ ఉన్నట్లైతే దీనికి ఎగ్ వైట్‌ను ఉపయోగించుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. 
 
అలాగే కొబ్బరి నూనె, బాదం, ఆలివ్, జోజోబా ఆయిల్‌ను ఒక బౌల్లో మిక్స్ చేసి, అందులో కొద్దిగా విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి మిక్స్ చేయాలి. దీన్ని తలకు పట్టిస్తూ, 10 నిముషాలు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకొనే ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రోజువిడిచి రోజు వేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుందని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు.