శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (18:35 IST)

అరటి పండు, తేనెతో హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలి?

అరటి పండు, తేనెతో హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలంటే.. రెండు అరటిపండ్లుకు పొట్టు తీసి మెత్తగా చేయాలి. దీనికి తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

అలాగే బాగా పండిన అవొకాడోను మ్యాష్ చేసి. అందులో అరకప్పు పాలు పోసి, తర్వాత ఒక చెంచా ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ కూడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
అలాగే పెరుగు జుట్టుకు డీప్ కండీషన్ ఇస్తుంది. జుట్టు పొడవును బట్టి, హెయిర్ మాస్క్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె మిక్స్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత తలకు పట్టించి 15నిముసాల తర్వాత స్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును స్మూత్‌గా గ్లాసీగా మార్చుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.