శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (11:16 IST)

తేనె ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం మీ సొంతం.. తేనె-పాలు, శనగపిండి పేస్టుతో..?!

తేనె ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెను నీటిలో కలుపుకుని తాగితే బొజ్జ తగ్గిపోతుంది. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారిని ఊబకాయం వేధిస్తుంది. ఊబకాయంతో బొజ్జ పెరిగిపోతుంటే తేనెను నీటి

తేనె ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెను నీటిలో కలుపుకుని తాగితే బొజ్జ తగ్గిపోతుంది. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారిని ఊబకాయం వేధిస్తుంది. ఊబకాయంతో బొజ్జ పెరిగిపోతుంటే తేనెను నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడున తాగితే... రెండే నెలల్లో బొజ్జ తగ్గిపోతుంది. తేనెను టీ, కాఫీల్లో తీసుకుంటే అలసట తొలగిపోతుంది.
 
ఇక తేనె చర్మం కాంతివంతంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తేనెలో యాంటిబ్యాక్టీరియల్‌ ప్రాపర్టీస్‌ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను తేనె దూరం చేస్తుంది. తేనెను నేరుగా ప్యాక్‌లా చర్మంపై రాసుకోవచ్చు. అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో చర్మాన్ని కడిగేసుకోవాలి. తేనెలోని నీరు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. 
 
అంతేకాదు స్కిన్‌ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఇలా రోజూ చేయొచ్చు లేదా రోజు విడిచి రోజు చేయొచ్చు. అలాగే రెండు టీస్పూన్ల పాలు, ఒక టీస్పూను తేనెలో ఒక టీస్పూను శనగపిండి కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే చర్మం మృదువుగా కోమలంగా కాంతివంతంగా తయారవుతుంది.