శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 మే 2015 (15:37 IST)

అల్లం, తేనె కాంబినేషన్‌తో కంటి కింద నల్లటి వలయాలకు చెక్

అల్లం, తేనె కాంబినేషన్‌లో కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టవట్టునని బ్యూటీషన్లు అంటున్నారు. అల్లం చర్మానికి అవసరమయ్యే తేమను పోషణను అందిస్తుంది. చర్మం ముడుతలను నివారిస్తుంది. కళ్ళ క్రింద రక్త ప్రసరణ జరగడానికి సహాయపడుతుంది. అల్లం పేస్ట్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి కళ్ళ క్రింది భాగంలో మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను నివారిస్తుంది.
 
అలాగే కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.. ముడతలను నివారిస్తుంది. స్వచ్చమైన కొబ్బరి నూనెను కళ్ళ క్రింది అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ఇకపోతే... ఆలివ్ ఆయిల్ చర్మానికి తేమను, మాయిశ్చరైజర్‌ను పోషణను అందిస్తుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను కళ్ళ క్రింది భాగంలో అప్లై చేసి కొద్దిగా సున్నితమైన మసాజ్‌ను అందివ్వాలి . ఇలా ఒక నెలరోజులు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది‌. కళ్ళ క్రింద నల్లని వలయాలను నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీగా పనిచేస్తుంది.