బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (13:26 IST)

రోజుకు తేనె-ఉల్లిరసం సమపాళ్లలో తాగితే..?

రోజుకు తేనె- ఉల్లిరసం సమపాళ్లలో కలిపి తీసుకుంటే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నమలాలి. నమిలితే వచ్చే రసాన్

రోజుకు తేనె- ఉల్లిరసం సమపాళ్లలో కలిపి తీసుకుంటే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నమలాలి. నమిలితే వచ్చే రసాన్ని మింగడం వల్ల శరీరానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక స్పూన్ తేనేలో చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీనిని తీసుకుంటే రక్తప్రసరణ మెరవడమే కాకుండా రక్త వృద్ధి జరుగుతుంది. అంతేగాకుండా చర్మానికి మెరుపు వస్తుంది. 
 
ఇకపోతే.. ఉదయం.. సాయంత్రం పూట అరగంటైనా నడవాలి. ఇలా చేయడం వల్ల డయాబెటీస్ అదుపులోకి వస్తుంది. బరువు కూడా తగ్గుతారు. ప్రతి రోజు అల్లంతో టీ తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. అదేవిధంగా నిత్యం గోధుమ జావ తీసుకోవాలి. ఈ జావా తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది.