బంగాళాదుంప ముక్కలు కళ్ల మీద పెట్టుకుంటే?

మంగళవారం, 10 జులై 2018 (15:41 IST)

బంగాళాదుంపల్ని మెత్తగా చేసి దాని రసాన్ని తీసుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా కూడా మంచిది. చర్మం కమిలిపోయిన చోట దీనిని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. రెండు చెంచాల రసంలో చెంచా నిమ్మరసం కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. మెుటిమలు, మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు దూరమవుతాయి.
 
ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.  బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. 
 
తరచుగా ఇలా చేయడం వలన పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంప ముక్కలు తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపటి తరువాత కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తుంటే క్రమంగా నల్లటిమచ్చలు తగ్గుముఖం పడుతాయి.దీనిపై మరింత చదవండి :  
బంగాళాదుంప కంటి నల్లటి మచ్చలు ముల్తానీ మట్టి బాదం నూనె పాలపొడి ముఖం చర్మం నిమ్మరసం రోజ్‌వాటర్ బ్యూటీ చిట్కాలు Lemon Badam Oil Face Skin Milk Powder Beauty Tips Potato Eyes Black Marks Multani Mitti Rose Water

Loading comments ...

మహిళ

news

పెళ్లికి మేకప్ ఎలా వేసుకోవాలంటే?

మేకప్‌కి దూరంగా ఉన్నప్పటికి వివాహ వేడుకలకు తప్పనిసరి కావలసిన విషయం. ఇలాంటప్పుడు మేకప్ ...

news

గోళ్లు అందంగా కనిపించాలంటే?

గోళ్లు అందంగా కనిపించడానికి వాటికి నెయిల్‌పాలిష్ వేస్తుంటాం. ఇంకాస్త కొత్తగా కనిపించాలంటే ...

news

పెడిక్యూర్ ఎలా చేస్తారు?

చాలామంది మహిళలు లేదా పురుషులు తమ ముఖసౌందర్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత వారి కాళ్ళకు ఇవ్వరు. ...

news

మందార పూవులను కొబ్బరినూనెలో దోరగా వేయించి....

మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పూవు మందార పూవు. మనం నల్లటి వత్తైన జట్టును పొందాలంటే ఈ ...