మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (12:34 IST)

అవొకాడో గుజ్జులో ఉన్న బ్యూటీ సీక్రెట్స్.. అవొకాడో, తేనెను కలిపి?

అవొకాడో గుజ్జును ముఖానికి పట్టించి స్పాస్టోన్‌తో మర్దన చేయాలి. దీనివల్ల ముఖంలోని కణాలకు రక్తప్రసరణ జరిగి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. అవొకాడో పిండిలో తేనెను మిక్స్ చేసి ముఖానికి రాసి పావుగంట తర్వా

అవొకాడో గుజ్జును ముఖానికి పట్టించి స్పాస్టోన్‌తో మర్దన చేయాలి. దీనివల్ల ముఖంలోని కణాలకు రక్తప్రసరణ జరిగి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

అవొకాడో పిండిలో తేనెను మిక్స్ చేసి ముఖానికి రాసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అవొకాడో గుజ్జులో ఉప్పు, చక్కెర, పాలు, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగితే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. 
 
అవొకాడోను ఉడికించి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మంచి స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల మృత కణాలు, నల్లని మచ్చలు మాయమవుతాయి. కొబ్బరి పేస్ట్, అవొకాడో పేస్ట్‌ని మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఈ ప్యాక్ మాయిశ్చరైజర్‌గానూ, పొడిబారకుండా ఉండేందుకు సహాయపడుతుంది.