శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 4 జులై 2018 (12:51 IST)

నిమ్మరసం, తేనె ముఖానికి రాసుకుంటే? ముఖం మృదువుగా మారుతుందా?

చర్మ సంరక్షణ విషయంలో కాస్త శ్రద్ధ పెడితేనే అందం రెట్టింపవుతుంది. చిన్నచిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. చర్మంపై మృతకణాలు పేరుకున్నప్పుడు ముఖం నిర్జీవంగా మారుతుంది. చర్మం మీ వయస్సు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పావుకప్పు బొప్పాయి గుజ్జులో కాస్

చర్మ సంరక్షణ విషయంలో కాస్త శ్రద్ధ పెడితేనే అందం రెట్టింపవుతుంది. చిన్నచిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. చర్మంపై మృతకణాలు పేరుకున్నప్పుడు ముఖం నిర్జీవంగా మారుతుంది. చర్మం మీ వయస్సు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పావుకప్పు బొప్పాయి గుజ్జులో కాస్త పెరుగు, పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
 
10 నిమిషాల తరువాత కడుక్కుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఇలా చేయడం వలన రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. కళ్లకింద నల్లడి చారలు ఏర్పడి చర్మం సాగినట్లు అనిపిస్తే కోడి గుడ్డులోని తెల్ల సొనను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
 
ఇలా చేస్తే చర్మం బిగుతుంగా మారడంతోపాటు కళ్లు కాంతివంతగా కనిపిస్తాయి. చర్మానికి తగిన మెుత్తంలో విటమిన్ ఇ అందితే మేని నిగనిగలాడుతుంది. దీనికి రెండు చెంచాల తేనెలో కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మానికి తేమ అంది నిగనిగలాడుతుంది.