మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (18:03 IST)

మృదువైన చర్మానికి.. నిమ్మ మర్దన..!

వాతావరణంలో మార్పులు, వాయు కాలుష్యం వంటి పలు కారణాల వలన చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. రోజు వాడి సువాసన భరితమైన సబ్బులు, షవర్ బాత్, వేడి నీటి స్నానం వలన కూడా మృదువైన చర్మంలో నూనె శాతం తగ్గి గరుకుగా తయారవుతుంది. 
 
అంటువంటి వారు ప్రతి రోజూ స్నానం చేయడానికి ముందు నిమ్మకాయను కోసి, ఆ దబ్బలతో శరీరాన్ని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత పది నిమిషాలు ఆగిన వేడి తక్కువగా ఉన్న నీటితో స్నానం చేస్తే శరీరం మృదుత్వాన్ని మళ్లీ సంతరించుకుంటుంది.