శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (17:34 IST)

నిమ్మపండు-పుదీనా-తులసితో మొటిమలకు చెక్

నిమ్మపండు-పుదీనా-తులసి ఈ మూడింటితో మొటిమలకు చెక్ పెట్టవచ్చును. నిమ్మలోని సిట్రస్ ఆమ్లం పింపుల్స్‌ను దూరం చేసి ఫేస్‌ను తాజాగా ఉంచుతుంది. నిమ్మ ఆకులు, నిమ్మ పౌడర్ పెరుగు లేక కీరకాయ రసంతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకొని 20 నిమిషాలు పాటు అలాగే ఉంచుకొని తర్వాత రోజ్ వాటర్‌తో ఫేష్ వాస్ చేసుకుంటే మొటిమలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. 
 
అలాగే పుదీనా బ్యాక్టీరియాను కిల్ చేసి.. చర్మం లోపుల ఉన్న దుమ్ము, ధూళి, క్రిములను వెలివేస్తుంది. తద్వారా మొటిమలు రానీయకుండా చేస్తుంది. ఇక మూడోది తులసి.. దగ్గు, రక్తహీనత చెక్ పెట్టడంతో పాటు తులసి ప్యాక్ మొటిమలను తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.